ఉత్త‌ర స‌ముద్రంలో కుప్ప‌కూలిన అమెరికా విమానం

అగ్ర‌రాజ్యం అమెరికాలో పెనుప్ర‌మాదం సంభ‌వించింది. అమెరికా వైమానిక ద‌ళానికి చెందిన విమానం ఒక‌టి ఉత్త‌ర స‌ముద్రంలో కుప్ప‌కూలింది. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో...

ఉత్త‌ర స‌ముద్రంలో కుప్ప‌కూలిన అమెరికా విమానం

Updated on: Jun 15, 2020 | 7:36 PM

అగ్ర‌రాజ్యం అమెరికాలో పెనుప్ర‌మాదం సంభ‌వించింది. అమెరికా వైమానిక ద‌ళానికి చెందిన విమానం ఒక‌టి ఉత్త‌ర స‌ముద్రంలో కుప్ప‌కూలింది. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో ఒక పైలెట్ ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే, అత‌ని ఆచూకీ మాత్రం ల‌భించ‌లేద‌ని చెప్పారు. 48వ ఫైట‌ర్ వింగ్‌కు చెందిన ఎఫ్‌-15 సీ ఈగిల్ విమానం ఆర్ ఏఎఫ్ లాకెన్ హీత్‌లో ఒక సాధార‌ణ శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో ఉండ‌గా..సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల 40 నిమిషాల ప్రాంతంలో కూలిపోయింది. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. కాగా, జ‌రిగిన ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న యూకే రెస్క్యూ బృందం ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. లాకెన్‌హీత్ అనేది రాయల్ వైమానిక స్థావరం. ఇది అమెరికా వైమానిక దళం లిబర్టీ వింగ్‌గా పిలిచే 48 వ ఫైటర్ వింగ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ స్థావరం లండన్ నుంచి ఈశాన్యంగా 80 మైళ్ల (130 కిలోమీటర్లు) దూరంలో ఉంది.