Andhra Pradesh: వివాహ వేడుకకు వెళ్తుండగా.. అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి
కృష్ణాజిల్లాలో(Krishna District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం అంపాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి కల్వర్టును వేగంగా ఢీ కొట్టింది....
కృష్ణాజిల్లాలో(Krishna District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం అంపాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి కల్వర్టును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు విజయనగరం (Vizianagaram) వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాసేపట్లో వేడుక జరిగే ప్రదేశానికి చేరుకుంటారనుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి