Kerala: కేరళలో విషాదం.. మ్యాచ్ చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన గ్యాలరీ
ఎంతో ఉత్కంఠతో మ్యాచ్ జరుగుతోంది. తమ అభిమాన జట్టు గెలవాలంటూ అభిమానులు కేరింతలు, చప్పట్లు కొడుతున్నారు. చాలా మంది ఆనందంలో మునిగిపోయారు. ఇదే సమయంలో ఓ ఊహించని దుర్ఘటన...
ఎంతో ఉత్కంఠతో మ్యాచ్ జరుగుతోంది. తమ అభిమాన జట్టు గెలవాలంటూ అభిమానులు కేరింతలు, చప్పట్లు కొడుతున్నారు. చాలా మంది ఆనందంలో మునిగిపోయారు. ఇదే సమయంలో ఓ ఊహించని దుర్ఘటన జరిగింది. మ్యాచ్ చూస్తున్న అభిమానులు కూర్చున్న గ్యాలరీ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కేరళ(Kerala) లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల గ్యాలరీ ఆకస్మాత్తుగా కూలిపోయింది. మలప్పురం(Malappuram) జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రితో పాటు సమీపంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. కాగా.. ప్రమాదం జరిగినప్పుడు భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది.
Kerala | Several people got injured after a gallery collapsed during a football match at Pookottumpadam in Malappuram district last night. Injured admitted to hospital. More details awaited pic.twitter.com/vlYYAqAMc8
ఇవి కూడా చదవండి— ANI (@ANI) June 7, 2022
ఏం జరుగుతుందో తెలియక.. ప్రాణాలు కాపాడుకునేందుకు.. గాయాలపాలై బాధతో విలవిల్లాడుతున్న దృశ్యాలు గుండె బరువెక్కించాయి. ఈ వీడియోలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. అభిమానులు, ప్రజలు, నిర్వాహకులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. కాగా.. కేరళలో ప్రాంతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి