Crime News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం.. మరో ముగ్గురి పరిస్థితి..
East Godavari Road Accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి
East Godavari Road Accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఆగిఉన్న లారీని.. వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని.. మరో మగ్గురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని అంబులెన్స్‌లో తుని ఆసుపత్రికి తరలించారు. మృతులను రాజమహేంద్రవరానికి చెందిన మహిళ పట్నాల రాము, రమణ(21)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: