ORR Accident: ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. అగ్నికి ఆహుతైన డ్రైవర్, క్లీనర్
Accident on Orr: హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. చేపల లోడుతో వెళుతున్న కంటైనర్‌లో
Accident on Orr: హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. చేపల లోడుతో వెళుతున్న కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున హిమయత్ సాగర్ అప్ప సంక్షన్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. వివరాలు.. ఏపీ నర్సాపూర్ నుంచి ముంబై రోయ్యల లోడుతో వెళుతున్న కంటైనర్‌లో అప్ప జంక్షన్ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దానిలో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ కూడా అగ్నికి ఆహుతయ్యారు. మృతులను సూరజ్, మృతుంజయ్ గా పోలీసులు గుర్తించారు. అయితే కంటైనర్‌ను మరో వాహనం ఢికొనడంతోనే మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకొని పరిశీలించారు. అనంతరం క్రేన్ సహాయంతో లారీని రోడ్డుపై నుంచి తొలగించారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను తొలగించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని.. సీసీ టీవీలను పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అనంతరం ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Also Read: