AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా పోలీసులకు చుక్కలు చూపించిన క్రిమినల్..!

అమెరికాలోని ఒక్లహామ్‌లో ఓ హంతకుడు పోలీసులకు చుక్కులు చూపించాడు. మోటరిస్టుపై కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న డమకో టేలర్‌ను పోలీసులు వెంబడించారు. అయితే లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు. టేలర్ కారు బ్రిడ్జిని ఢీ కొట్టి ఆగిపోయింది. కారులో నుంచి బయటికి వచ్చిన డమకో టేలర్ పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో కాసేపు బ్రిడ్జిని పట్టుకుని వేలాడాడు. పోలీసులు లొంగిపోవాలని పదే పదే హెచ్చరించినా అతడు వినకుండా వంతెన పై నుంచి దూకేశాడు. దీంతో తీవ్రగాయాల పాలయ్యాడు. గాయాలపాలైన […]

అమెరికా పోలీసులకు చుక్కలు చూపించిన క్రిమినల్..!
Pardhasaradhi Peri
|

Updated on: Jun 15, 2019 | 5:40 PM

Share

అమెరికాలోని ఒక్లహామ్‌లో ఓ హంతకుడు పోలీసులకు చుక్కులు చూపించాడు. మోటరిస్టుపై కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న డమకో టేలర్‌ను పోలీసులు వెంబడించారు. అయితే లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు. టేలర్ కారు బ్రిడ్జిని ఢీ కొట్టి ఆగిపోయింది. కారులో నుంచి బయటికి వచ్చిన డమకో టేలర్ పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో కాసేపు బ్రిడ్జిని పట్టుకుని వేలాడాడు. పోలీసులు లొంగిపోవాలని పదే పదే హెచ్చరించినా అతడు వినకుండా వంతెన పై నుంచి దూకేశాడు. దీంతో తీవ్రగాయాల పాలయ్యాడు. గాయాలపాలైన అతన్ని పోలీసులు పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. గత ఏప్రిల్‌లో జరిగిన ఓ ఘటనలో అతడు నిందితుడిగా ఉన్నాడు. కారులో పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది.