Treasure hunt: మహాశివరాత్రి వేళ గుప్తనిధుల వేట.. తవ్వగా.. తవ్వగా… చివరికి ఊహించని ట్విస్ట్…

| Edited By: Team Veegam

Mar 12, 2021 | 6:40 PM

మహాశివరాత్రి వేళ నారాయణపేట జిల్లాలో గుప్తనిధుల కలకలం రేపింది. అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ పురాతన రామాలయంలో సన్నిధిలో గుర్తు తెలియని వ్యక్తులు..

Treasure hunt: మహాశివరాత్రి వేళ గుప్తనిధుల వేట.. తవ్వగా.. తవ్వగా... చివరికి ఊహించని ట్విస్ట్...
గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు.. చివరకు
Follow us on

మహాశివరాత్రి వేళ నారాయణపేట జిల్లాలో గుప్తనిధుల కలకలం రేపింది. అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ పురాతన రామాలయంలో సన్నిధిలో గుర్తు తెలియని వ్యక్తులు..గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు గుర్తించారు ఇక్కడి స్థానికులు.

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలానికి చెందిన అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఉంది ఈ పురాతన రామదేవుడి మందిరం. మహా శివరాత్రి సందర్బంగా ఇక్కడి ఆలయంలో పూజలు చేయడానికి వచ్చిన స్థానికులు ఆలయ సమీపంలో భారీ గుంతను గుర్తించారు. మందిరం ముందు భాగంలో సుమారు 10 ఫీట్ల లోతైన గుంతలు కనిపించాయి. అవి చూసి స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. సమీపంలోనే గుప్తనిధుల తవ్వకాల కోసం పూజకు అవసరమైన సామాగ్రి, గుమ్మడి కాయలు ఉండటం గమనించారు. ఇదంతా చూసిన గ్రామస్తులు ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు..గుప్తనిధుల కోసమే ఈ భారీ గుంతను తవ్వినట్లుగా అనుమానిస్తున్నారు.

అయితే, ఈ గుంత అడుగు భాగంలో మరో కట్టడం ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ నిధులు దొరికి ఉండవచ్చని లేదంటే…మరో మందిరం ఆనవాళ్లు కనపడడంతో తవ్వడానికి వీలు కాకపోవటంతో దుండగులు పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఆలయంలో తవ్వకాలు జరపడం ఇది రెండోసారి అంటున్నారు స్థానిక ప్రజలు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం.. మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం

PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..