Pori Moni arrested: బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా ప్రముఖ బంగ్లాదేశ్ నటి పోరి మోనిని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) అదుపులోకి తీసుకుంది. జూన్ 8 న బోట్ క్లబ్‌లో తనపై అత్యాచారం చేసి చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని పోరి మోని ఆరోపణలు చేసిన అనతి కాలంలోనే.. పోలీసులు బంగాదేశ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్‌పై కన్నేశారు. దీనిలో భాగంగా.. ఢాకాలోని బనానీలో పోరి మోని నివాసంలో బుధవారం నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు. అనంతరం పలు కీలక ఆధారాలను సేకరించి.. ఆమెను ఎలైట్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. అయితే.. ప్రముఖ నటిని పోరి మోనీని అరెస్టు చేసినట్లు రాపిడ్ యాక్షన్ లీగల్ అండ్ మీడియా వింగ్ డైరెక్టర్ కమాండర్ ఖండకర్ అల్ మొయిన్ ధృవీకరించారు. అయితే.. తనిఖీల్లో ఆమె ఇంటి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కాగా.. పోరి మోని.. బోట్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, రాజకీయ నాయకుడు నాసిర్ ఉద్దీన్ మహమూద్ తనపై దాడి చేసినట్లు జూన్‌లో పలు ఆరోపణలు చేసింది. మహమూద్ తనపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. అయితే నిందితుడు బంగ్లాదేశ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ బెనజీర్ అహ్మద్‌కు సన్నిహితుడు కావడంతోనే ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోరి మోనీ పేర్కొంది. ఆ తర్వాత.. పోరీ మనినే తమ క్లబ్‌లో విధ్వంసానికి పాల్పడిందని క్లబ్ నిర్వాహకులు ఆమెపై ఫిర్యాదు చేశారు. అనంతరం రెండు నెలలకు ఆమె డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం సంచలనంగా మారింది.
Also Read: