Accident: పుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
వారంతా వలస కూలీలు. బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని ఉన్న వారిని వదిలి పెట్టి వచ్చారు. పొద్దంతా కాయా కష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారంతా బృందంగా ఏర్పడి పనులు చేసుకుంటున్నారు. ఉండటానికి....
వారంతా వలస కూలీలు. బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని ఉన్న వారిని వదిలి పెట్టి వచ్చారు. పొద్దంతా కాయా కష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారంతా బృందంగా ఏర్పడి పనులు చేసుకుంటున్నారు. ఉండటానికి వసతి సౌకర్యం లేకపోవడంతో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై పడుకున్నారు. రోజూ లాగే బుధవారం పనులు చేసుకుని రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం లేచి మళ్లీ పనులకు వెళ్లేందుకు అవసరమైన సామగ్రినంతా సర్దుకున్నారు. బాగా అలసిపోవడంతో గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. అదే వారి ఆఖరి రాత్రి అవుతుందని గుర్తించలేకపోయారు. గురువారం తెల్లవారు జామున వారిపై నుంచి ఓ లారీ వేగంగా దూసుకెళ్లింది. అంతే.. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన హరియాణాలోని ఝాజ్జర్ జిల్లాలో జరిగింది. గురువారం తెల్లవారు జామున కుండలీ-మనేసర్- పాల్వాల్ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో11 మంది గాయపడ్డారు.
అశోద టోల్ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 18 మంది కూలీలు పని చేస్తున్నారు. వారిలో 14 మంది పని అనంతరం విరామం కోసం సమీపంలోని ఫుట్‌పాత్‌పై సేదతీరారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఓ లారీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Gyanvapi Masjid Case: రేపటి వరకూ విచారణ ఆపివేయండి.. జ్ఞానవాపి కేసు విచారణకు సుప్రీం కోర్టు బ్రేక్..
Vastu Tips: భార్యాభర్తల మధ్య విబేధాలా.. ఇంట్లో ఈ దిశలో రజినిగంధను పెంచుకోండి..