Telangana: మరణంలోనూ వీడని స్నేహ బంధం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

|

Jun 24, 2022 | 6:22 AM

దైవదర్శానికి వెళ్లి.. తిరిగి ఇంటికి వస్తున్నామన్న సంతోషం వారిలో ఎంతో సమయం మిగలలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిపై పంజా విసిరింది. ముగ్గురు స్నేహితులను బలి తీసుకుంది. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన....

Telangana: మరణంలోనూ వీడని స్నేహ బంధం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
Accident
Follow us on

దైవదర్శానికి వెళ్లి.. తిరిగి ఇంటికి వస్తున్నామన్న సంతోషం వారిలో ఎంతో సమయం మిగలలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిపై పంజా విసిరింది. ముగ్గురు స్నేహితులను బలి తీసుకుంది. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తెలంగాణలోని జనగామ(Jangaon) జిల్లా దేవరుప్పల మండలం సింగరాజపల్లి గ్రామానికి చెందిన నవీన్‌ ఉప్పల్‌ (Uppal) లో నివాసముంటున్నాడు. కారు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లింగాలఘనాపూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్‌, మెట్‌పల్లి మండలం మెట్లచింతాపూర్‌ గ్రామానికి చెందిన వినీత ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. వీరు ముగ్గరూ కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం యాదాద్రి వెళ్లారు.

స్వామిని దర్శించుకుని గురువారం తెల్లవారుజామున తిరిగి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..