Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

| Edited By: Ravi Kiran

Feb 26, 2022 | 7:57 PM

హైదరాబాద్‌లో వేళ్లూనుకుంటున్న డ్రగ్స్ కల్చర్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది కేసీఆర్ ప్రభుత్వం. ఇటీవల డ్రగ్స్ కట్టడిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Hyderabad: నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Drugs
Follow us on

హైదరాబాద్‌లో వేళ్లూనుకుంటున్న డ్రగ్స్ కల్చర్‌ను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది కేసీఆర్ ప్రభుత్వం. ఇటీవల డ్రగ్స్ కట్టడిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందించారు హైదరాబాద్ (Hyderabad)  పోలీసులు . డ్రగ్స్ నియంత్రణకు రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, మత్తు వదిలిస్తున్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు హైదరాబాద్‌ పోలీసులు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు జూబ్లీహిల్స్ పోలీసులు. యూసుఫ్‌గూడలోని జానకమ్మ తోట వద్ద నిషేధిత డ్రగ్స్ విక్రయాలు కొనసాగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పక్కా ప్లాన్‌తో దాడి చేశారు పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకొని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ఖాజా మొయినుద్దీన్, కార్తీక్, అభిషేక్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితులుగా నధీం, అజార్‌లు పరారీలో ఉన్నట్టు తెలిపారు.

కాగా నిందితుల వద్ద నుంచి 520 మిల్లీ గ్రాముల మిథైలెండియోక్సీ, మెథాం ఫేటమిన్, 4 మొబైల్ ఫోన్లు, యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అటు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు పోలీసులు. అటు డ్రగ్స్‌ కట్టడికి నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్‌విజన్ వింగ్ పేరిట రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ విభాగాలు పనిచేస్తున్నాయి. డ్రగ్స్ ట్రాఫికింగ్, డ్రగ్స్ ముఠాల అరెస్టు నుంచి ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తున్నాయి ప్రత్యేక విభాగాలు.

Also Read:Russia Ukraine Crisis: నేను సెంట్రల్‌ కీవ్‌ లోనే ఉన్నాను.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు..

Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్‌ వార్‌ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?

Viral Video: కంగారూతో మాములుగా ఉండదు మరి.. పంచ్ ఇస్తే పడిపోవాల్సిందే.. అంతేగా..