Crime News: పసిమొగ్గను చిదిమేసిన మూఢ విశ్వాసం.. ఆరు నెలల చిన్నారిని బలిచ్చిన అమ్మమ్మ, తాతయ్య!

|

Dec 19, 2021 | 11:04 AM

మూఢ విశ్వాసం ఓ పసిమొగ్గను చిదిమేసింది. అనారోగ్యం దూరమవుతుందన్న ఓ మాయగాడి మాటలు నమ్మి చిన్నారిని బలిచ్చారు అమ్మమ్మ, తాతయ్య.

Crime News: పసిమొగ్గను చిదిమేసిన మూఢ విశ్వాసం.. ఆరు నెలల చిన్నారిని బలిచ్చిన అమ్మమ్మ, తాతయ్య!
Arrest
Follow us on

Tamil Nadu Sacrificed Six Month Old Girl Infant: మూఢ విశ్వాసం ఓ పసిమొగ్గను చిదిమేసింది. అనారోగ్యం దూరమవుతుందన్న ఓ మాయగాడి మాటలు నమ్మి చిన్నారిని బలిచ్చారు అమ్మమ్మ, తాతయ్య. అలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తంజావూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన నిందితుల అరెస్టుతో అసలు విషయం బయటకు వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మల్లిపట్టినం గ్రామానికి చెందిన నజూరుద్దీన్‌(32) కుమార్తె హాజరా(6 నెలలు) ఇటీవల అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల చిన్నారికి వరుసకు అమ్మమ్మ అయ్యే షర్మిలాబేగం(48) హత్య చేసినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

షర్మిలాబేగం భర్త అజారుద్దీన్‌(50) విదేశాల నుంచి తిరిగి వచ్చాక తరచూ అనారోగ్యంతో బాధపడేవాడు. దీంతో మహ్మద్‌ సతీమ్‌ అనే వ్యక్తిని సలహా మేరకు షర్మిలాబేగం తన అక్క కొడుకు నజూరుద్దీన్‌ కుమార్తె హాజరాను తీసుకొచ్చి చేపల తొట్టెలో ముంచి చంపింది. తర్వాత బాధిత కుటుంబంతో మాట్లాడి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, ఇంటి ముందు కదలాడిన చిన్నారి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు నజూరుద్దీన్‌ దంపతులను నిలదీశారు. వారి నుంచి సరియైన సమాచారం రాకపోవడంతో స్థానికి వీఏవో సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పట్టుకోట్టై తహసీల్దారు జ్ఞానేశ్వరన్‌ సమక్షంలో మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం చేశారు. షర్మిలాబేగం, ఆమె భర్త అజారుద్దీన్‌, మహ్మద్‌ సతీమ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నామని పోలీసులు తెలిపారు.

Read Also… Aadhaar: ఆధార్‌ కార్డు లేకుంటే మీ జీవితం అసంపూర్ణమే..! ముఖ్యమైన ఈ పనులకు కచ్చితంగా అవసరం..