బెజవాడలో ఘరానా చోరీ.. షార్ట్ ఫిల్మ్ చేయాలని పిలిచి కెమెరామెన్‌కు కుచ్చుటోపీ.. కెమెరాలతో ఉడాయించిన దొంగలు..

వీరి చోరీలు అంతా సాఫీగా సాగుతుంటాయి. ఎక్కడ కూడా అనుమానం రాకుండా పక్కా ప్లాన్‌తో స్కెచ్ అమలు చేస్తుంటారు. ఇలాంటి ఘరానా మోసం..

బెజవాడలో ఘరానా చోరీ.. షార్ట్ ఫిల్మ్ చేయాలని పిలిచి కెమెరామెన్‌కు కుచ్చుటోపీ.. కెమెరాలతో ఉడాయించిన దొంగలు..
Dhongalu
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 16, 2021 | 4:57 PM

దొంగలు పలు రకాలు.. కొందరు రాత్రి సమయంలో చోరీలకు పాల్పడితే.. మరికొందరు టార్గెట్ చేసుకుని వెరైటీ దొంగతనాలు చేస్తుంటారు. వీరు చాలా తెలివిగా ముందే స్కెచ్ వేసి ఘరానా మోసాలకు తెరలేపుతుంటారు. వీరి చోరీలు అంతా సాఫీగా సాగుతుంటాయి. ఎక్కడ కూాడా అనుమానం రాకుండా పక్కా ప్లాన్‌తో స్కెచ్ అమలు చేస్తుంటారు. ఇలాంటి ఘరానా మోసం ఒకటి బెజవాడలో చోటు చేసుకుంది. ముందే స్కెచ్ వేసుకున్న ఈ కేటుగాళ్లు.. తమ ప్లాన్‌ తూచా తప్పకుండా అమలు చేశారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితుడు ఆ తర్వాత బోదిబోమంటున్నాడు. అచ్చం ఇలాంటి ఘరోనా మోసం ఒకటి విజయవాడలో చోటు చేసుకుంది. గవర్నర్‌పేట పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అసలు క్రైమ్ స్టోరీ ఇలా ఉంది.

బెజవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. షార్ట్ ఫిల్మ్ తీయాలని ఓ వ్యక్తి హైదరాబాదు నుండి కెమెరాలను విజయవాడ కు పిలిపించాడు. హైదరాబాదు కమలాపురి కాలనీ నుండి కెమెరాలతో కెమెరామెన్ కేతవత్ నందు విజయవాడ వచ్చాడు.

ఆటోలో ఇద్దరు వ్యక్తులు వచ్చి కెమెరాలతో కేతవత్ ను బస్టాండ్ నుండి బందర్ రోడ్డులోని సువర్ణ హోటల్ కు తీసుకు వెళ్లారు. కెమెరామెన్ ను భోజనానికి పంపి హోటల్ లో పెట్టిన 20 లక్షల రూపాయల విలువైన కెమెరాలతో ఆ వ్యక్తి ఉడాయించాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాదితుడు కేతవత్ నందు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన గవర్నర్ పేట పోలీసులు హోటల్ లోని సీసీఫుటేజ్ అధారంగా కేసు ధర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో గతంలో నెల్లూరులో కూడా జరిగాయని బాధితులు చెప్తున్నారు. నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధితుడు.

ఇవి కూడా చదవండి: Aadhaar-Voter ID Link: బోగస్‌ ఓట్ల ఏరివేతకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌!

Tirumala: శ్రీవారి సేవలో బాలయ్య, బోయపాటి.. అఖండ సినిమాతో ఇండస్ట్రీకి ప్రేక్షకులు ఊపిరిపోశారన్న బాలకృష్ణ