చివరి అంకానికి చేరిన రాజీవ్ హంతకుల విడుదల కేసు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న సొలిసిటర్ జనరల్ 

మాజీ ప్రధాని రాజీవ్‌ గాందీ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ విషయంలో జరుగుతున్న ఆలస్యంపై..

చివరి అంకానికి చేరిన రాజీవ్ హంతకుల విడుదల కేసు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న సొలిసిటర్ జనరల్ 
Follow us

|

Updated on: Jan 22, 2021 | 5:53 AM

Release of Convicts : మాజీ ప్రధాని రాజీవ్‌ గాందీ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు గవర్నర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఈ విషయంలో జరుగుతున్న ఆలస్యంపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల విచారం వ్యక్తం చేసింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హంతకుల విడుదల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎల్‌టీటీఈ(LTTE) ఉగ్రవాదులు రాజీవ్‌నే హతమార్చారు. ఆ కేసులో హంతకులు పెరారివలన్, మురుగన్, శాంతం, నళిని శ్రీహరన్, రాబర్ట్ పయస్, జయ కుమార్, రవి చంద్రన్‌లకు జీవిత ఖైదు విధించారు.

వీరంతా తమిళనాడులోని వేర్వేరు జైళ్లలో శిక్షను అనుభవించారు. శిక్షా కాలం కూడా పూర్తి చేసుకున్నారు. అయితే వీరి విడుదల చేయాలంటూ తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం 2018లో సిఫారసు చేసింది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో కూడా పటిషన్‌ దాఖలు కాగా రాజీవ్‌ హంతకులను విడుదల చేయడం సరికాదని కేంద్రం న్యాయస్థానానికి స్పష్టం చేసింది.

అయితే వీరి విడుదల నిర్ణయం విషయంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు ఇటీవల విచారం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసులు రెండేళ్ళ నుంచి పెండింగ్‌లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ మూడు లేదా నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..