AP Crime News: అడిగితే డబ్బులివ్వలేదని అత్త ఇంటికే కన్నం వేసి.. బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లిన అల్లుళ్ళు ఎక్కడంటే..
AP Crime News: విజయనగరం జిల్లా కొమరాడలో వారం రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీ కేసు చేధించిన పోలీసులు.. దొంగలెవరో కనిపెట్టారు...
AP Crime News: విజయనగరం జిల్లా కొమరాడలో వారం రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీ కేసు చేధించిన పోలీసులు.. దొంగలెవరో కనిపెట్టారు. నిందితుల వివరాలను పోలీసులు బయటపెట్టడంతో అందరూ షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
రూరల్ మండలం గొల్లల పేటకు చెందిన కొయ్యి అప్పలరాజు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బంగారమ్మ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బీరువాలో బంగారం, నగదు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..వెంటనే రంగంలోకి దిగారు. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి.. ఆధారాలు సేకరించారు. ఇంటి వెనుక నుంచి వెళ్లి చోరీకి పాల్పడటంతో.. ఇది తెలిసినవాళ్ల పనిగా పోలీసులు అనుమానించారు. చోరీ జరిగిన ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు. అల్లుళ్ల ప్రవర్తనపై అనుమానం వచ్చి ప్రశ్నించగా.. చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. ఇద్దరు అల్లుళ్లు అత్తను డబ్బులు అడిగారు.. ఆమె ఇవ్వకపోవడంతో అత్త లేని సమయంలో చోరీ చేశారు. చోరీకి సంబంధించిన 8 తులాల బంగారం, నగదు సీజ్ చేశారు. ఇద్దరు అల్లుళ్లను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన చోరీ ఇంటి దొంగలపనేనని తెలియటంతో అంతా షాక్ అయ్యారు.