జిలిటెన్ స్టిక్ తిన్న ఆరేళ్ల బాలుడు… అక్కడికక్కడే మృతి
స్వీట్ అనుకొని జిలెటిన్ స్టిక్ కొరికిన ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చేపల వేటకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్‌ను కొరికిన ఆరేళ్ల బాలుడు అది పేలడంతో నెత్తురోడుతూ అక్కడికక్కడే చనిపోయాడు.

పెద్దల అజాగ్రత్త ఓ పసివాడి ప్రాణం తీసింది. స్వీట్ అనుకొని జిలెటిన్ స్టిక్ కొరికిన ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. చేపల వేటకు ఉపయోగించే జిలెటిన్ స్టిక్‌ను కొరికిన ఆరేళ్ల బాలుడు అది పేలడంతో నెత్తురోడుతూ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాద సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా అలగారై గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. కావేరీ నదిలో చేపలు పట్టడానికి ముగ్గురు స్థానికులు జిలెటిన్ స్టిక్స్ తయారు చేసుకున్నారు. రెండు వాడుకుని మూడోదాన్ని భూపతి అనే వ్యక్తి ఇంట్లో పెట్టారు. అయితే ఆ జిలిటెన్ స్టిక్ చూసిన భూపతి కుమారుడు ఏదో తినే వస్తువు అనుకుని నోట్లో పెట్టి కొరికాడు. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు..ముగ్గురు మత్స్యకారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




