AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లష్కరే భారీ కుట్ర భగ్నం.. పెద్ద ఎత్తున హెరాయిన్, కరెన్సీ స్వాధీనం..

జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున హెరాయిన్, ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

లష్కరే భారీ కుట్ర భగ్నం.. పెద్ద ఎత్తున హెరాయిన్, కరెన్సీ స్వాధీనం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 11, 2020 | 4:52 PM

Share

జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున హెరాయిన్, ఇండియన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కశ్మీర్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ సప్లై చేస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో సహకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదు లావాదేవీలు జరగకుండానే ఇలా డ్రగ్స్‌ సప్లై చేస్తూ వచ్చిన నగదును లష్కరే ఉగ్రవాదుల సంస్థలకు అందజేస్తూ హవాలా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి 21 కిలోల హెరాయిన్‌తో పాటు.. రూ.1.34 కోట్ల రూపాయల ఇండియన్‌ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

పట్టుబడ్డ ఉగ్రవాద సహచరులు పాక్‌లోని పలువురితో సన్నిహితంగా ఉంటూ.. డ్రగ్స్‌, హవాలా వ్యాపారం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన అనుచరులను అరెస్ట్ చేశామని.. ఈ టెర్రర్ మాడ్యూల్ వెనుక మరికొంత మంది ఉన్నట్లు గుర్తించామని హంద్వారా ఎస్పీ సుందీప్ చక్రవర్తి తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Follow Us
ఆశలు నెరవేరే సమయం.. అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
ఆశలు నెరవేరే సమయం.. అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా?
ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా?
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల రాజీనామా!
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల రాజీనామా!
పాకిస్థాన్‌లో బంగారం ధరల మోత..! భారత్‌తో పోలిస్తే ఎంత తేడా ఉందంటే
పాకిస్థాన్‌లో బంగారం ధరల మోత..! భారత్‌తో పోలిస్తే ఎంత తేడా ఉందంటే
నెల రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!
నెల రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!
ఇంట్లోనే న్యాచురల్‌గా తెల్లు జుట్టును నల్లగా మార్చుకోండి!
ఇంట్లోనే న్యాచురల్‌గా తెల్లు జుట్టును నల్లగా మార్చుకోండి!
సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్‌లో బిగ్ బ్రేక్..
సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్‌లో బిగ్ బ్రేక్..
మతం మార్పిడి రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు!
మతం మార్పిడి రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు!
నాన్నని నాన్నే మిస్ అవుతుంటాడు.. తండ్రి గురించి పూరి మాటల్లో..
నాన్నని నాన్నే మిస్ అవుతుంటాడు.. తండ్రి గురించి పూరి మాటల్లో..
ఈ వారం ఓటీటీలో ఈ 3 సినిమాలు తప్పక చూడాల్సిందే..
ఈ వారం ఓటీటీలో ఈ 3 సినిమాలు తప్పక చూడాల్సిందే..