AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి రోజు రాత్రే శవమైన నవ దంపతులు

మొదటి రోజు రాత్రే నవ వధువును హతమార్చాడు భర్త. తానూ ఊరి చివర ఉరి వేసుకుని చెట్టుకు వేలాడాడు.

మొదటి రోజు రాత్రే శవమైన నవ దంపతులు
Balaraju Goud
|

Updated on: Jun 11, 2020 | 8:02 PM

Share

ఏడు అడుగులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొత్త ఆశలు కోటి ఊహాలతో గదిలోకి అడుగుపెట్టిన నవ వధువును మొదటి రోజు రాత్రే హతమార్చాడు భర్త. భవిష్యత్ ఉహించుకుని తానూ ఊరి చివర ఉరి వేసుకుని చెట్టుకు వేలాడాడు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తిరువళ్ళూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమంజేరి గ్రామానికి చెందిన నివాసన్.. సాదనకుప్పంకు చెందిన తమ సమీప బంధువు సంధ్యను బుధవారం ఉదయం పెళ్లి చేసుకున్నాడు. దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వివాహం.. గుళ్లో సందడిగా జరిగింది. అయితే వివాహవేడుకల విషయంలో వధూవరులిద్దరి మధ్య ఆలయంలోనే గొడవ జరిగింది. ఆ గొడవే వారి జీవితాలు అంతంకావడానికి కారణమయింది. వివాహం అనంతరం ఇంటికి చేరుకున్న బంధువులు వధువరుల ఫస్ట్ నైట్ కోసం గదిని అలంకరించారు. వధూవరులను గదిలోకి పంపించారు. అయితే గదిలో కూడా పెళ్లి పందిరిపై మరోసారి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన నివాసన్.. సంధ్యను చంపి పరారయ్యాడు. ఉదయం గదిలోనుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో బంధువులు తలుపులు తీసి చూడగా.. సంధ్య మృతిచెంది ఉంది. కనిపించకుండా పోయిన నివాసస్ కోసం బంధువలందరూ వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గ్రామ శివారున ఉన్న చెరువు గట్టున నివాసన్ ఉరేసుకొని కనిపించాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.