5

ఆరుగురు కుటుంబసభ్యల అనుమానాస్పద మృతి

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు.

ఆరుగురు కుటుంబసభ్యల అనుమానాస్పద మృతి
Follow us

|

Updated on: Nov 11, 2020 | 7:30 PM

ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఒడిశాలోని బాలంగీర్ జిల్లా సంరపాడ గ్రామంలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. తెల్లవారినా కూడా ఆ ఇంటి తలుపులు తెరుచుకోకపోవడాన్ని స్థానికులు గమనించి ఇంట్లోకి తొంగి చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంరపాడ గ్రామంలో బులు జాని (50), అతని భార్య జ్యోతి (48), ఇద్దరు కుమార్తెలు,ఇద్దరు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. అయితే, బుధవారం ఉదయం జాని కుటుంబసభ్యులు ఎవరు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగున ఉన్నవారు వారిని పిలిచే ప్రయత్నం చేశారు. వారు స్పందించకపోవడంతో, కిటికీ నుంచి లోపలకు చూడగా ఇంట్లోని వారంతా అచేతనంగా పడి ఉన్నారు. వారిపై దుప్పట్లు కప్పి ఉన్నాయి. దీంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, కుటుంబంలోని ఆరుగురు సభ్యులు మరణించి ఉండటాన్ని గమనించారు. మృతులను బులు జాని (50), అతని భార్య జ్యోతి (48), ఇద్దరు కుమార్తెలు సరిత, శ్రేయ, ఇద్దరు కుమారులు భీష్మ, సంజీవ్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, వారి శరీరాలపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గమనించారు. దీంతో ఆ కుటుంబంలోని వారిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.