ఆ సైట్లను పంపిన ఎస్వీబీసీ ఉద్యోగిపై టీటీడీ వేటు

ఆ సైట్లను పంపిన ఎస్వీబీసీ ఉద్యోగిపై టీటీడీ వేటు

ఎస్వీబీసీలో ఘటనపై టీటీడీ స్పందించింది. ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్‌ పర్యవేక్షణలోకి తెస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Nov 11, 2020 | 8:02 PM

ఎస్వీబీసీలో ఘటనపై టీటీడీ స్పందించింది. ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్‌ పర్యవేక్షణలోకి తెస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో ఎస్వీబీసీ కంప్యూటర్ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇప్పటికే నీలి చిత్రాల లింక్‌లు పంపిన ఉద్యోగులపై వేటు చేసింది. వీడియోలు చూసిన మరికొంత మంది ఉద్యోగులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎస్వీబీసీ సీఈవో ప్రకటించారు.

శతమానం భవతి కార్యక్రమం కోసం ఓ భక్తుడు మొయిల్‌ చేయగా.. తిరిగి భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్‌ సైట్‌ లింక్ పంపాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తుడు టీడీడీ చైర్మన్‌, ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై చైర్మన్‌, ఈవో జవహర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఎస్వీబీసీ ఆఫీసులో టీటీడీ విజిలెన్స్‌, సైబర్‌ క్రైం అధికారులు తనిఖీలు నిర్వహించారు. విచారణలో భాగంగా టీటీడీకి చెందిన దాదాపు 25 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. కార్యాలయంలో పోర్న్‌సైట్లు చూస్తున్న.. ఐదుగురు ఉద్యోగుల్ని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. అలాగే, విధులు నిర్వర్తించకుండా ఇతర వీడియోలు చూస్తున్న.. మరో 25 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. త్వరలోనే వారి కూడా చర్యలు ఉంటాయని ఎస్వీబీసీ తెలిపింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu