ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లివ్యాను బోల్తా పడి ఏడుగురు మృతి

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లివ్యాను బోల్తా పడి ఏడుగురు మృతిచెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లివ్యాను బోల్తా పడి ఏడుగురు మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 30, 2020 | 8:39 AM

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లివ్యాను బోల్తా పడి ఏడుగురు మృతిచెందారు. ఈ ఘోర సంఘటన జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ ఘాట్‌రోడ్డులో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. పెళ్లికి హాజరై తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో వ్యాను కొండపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను గోకవరం మండలం టాకుర్‌పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తంటికొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం పూర్తయిన తర్వాత తిరిగి వస్తుండగా వ్యాన్‌ ప్రమాదానికి గురైంది. ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదికి రావాల్సిన వ్యాన్‌ మెట్లు పై నుంచి ఒక్కసారిగా కింద పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌ సహా వ్యాన్‌లో 22 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా..ఇద్దరి పరిస్ధితి సీరియస్‌గా ఉంది..12 మందికి చికిత్స అందిస్తున్నారు. శ్రీదేవి, నాగ శ్రీలక్ష్మి, భాను, ప్రసాద్‌, దొర, శివ గాయత్రి స్పాట్‌లోనే చనిపోగా.. గోపి అనే వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వివాహరం అనంతర మరో వాహనంలో వెళ్లడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వధువు స్వస్థలం రాజానగరం మండలం వెలుగుబంద కాగా.. వరుడు స్వస్థలం గోకవరం మండలం ఠాకూర్‌పాలెంగా పోలీసులు గుర్తించారు.