Republic Day violence: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలో చేటుచేసుకున్న హింసకాండలో పాల్గొన్న జస్‌ప్రీత్ సింగ్ అనే 29 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన సమయంలో జస్‌ప్రీత్ సింగ్ ఎర్రకోట బురుజుపైకి ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. రెడ్‌పోర్ట్ వద్ద ఒక ఇనుపరాడ్డును పట్టుకుని కూడా కెమెరాకు చిక్కాడు. అతను ఢిల్లీలోని స్వరూప్ నగర్‌లో ఉంటున్నట్టు గుర్తించారు.
కాగా, ఎర్రకోట వద్ద చెలరేగిన హింసాకాండ ఘటనలో మోస్ట్ వాటెండ్‌గా చెబుతున్న మనీందర్ సింగ్ అనే వ్యక్తిని గత వారంలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్టు చేసింది. స్వరూప్ నగర్‌లోని అతని ఇంట్లో 4.3 అడుగుల కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంది.
ఎర్రకోట వద్ద పొడవాటి కత్తిని అటూఇటూ తిప్పుతున్న వీడియో కూడా అతని మొబైల్ ఫోనులో కనుగొన్నారు. ఇదే కేసులో నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్ధూను సైతం ఈనెల 9న అరెస్టు చేశారు. జనవరి 26న హింసాకాండను రెచ్చగొట్టిన వారిలో సిద్ధూ ఒకడని పోలీసులు చెబుతున్నారు.