AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: అనాథను అంటూ మస్కా, ఏకంగా 3 పెళ్లిళ్లు.. మాయ లేడీ ఆచూకీ పట్టిన పోలీసులు

అనాధ అంటూ దగ్గరైంది. అదరించమని కోరింది. నిలువెత్తు మనిషిని నిలువునా ముంచేసి.. మస్కా కొట్టిందో మాయలేడీ. ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు...

Andhrapradesh: అనాథను అంటూ మస్కా,  ఏకంగా 3 పెళ్లిళ్లు.. మాయ లేడీ ఆచూకీ పట్టిన పోలీసులు
Women Cheting
Ram Naramaneni
|

Updated on: Jul 14, 2021 | 2:03 PM

Share

అనాధ అంటూ దగ్గరైంది. అదరించమని కోరింది. నిలువెత్తు మనిషిని నిలువునా ముంచేసి.. మస్కా కొట్టిందో మాయలేడీ. ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుందో నిత్య పెళ్లికూతురు. చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలం నారపరాజు కండ్రికకు చెందిన సునీల్ కుమార్.. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతనికి సుహాసిని అనే యువతి దగ్గరైంది. అనాధను అంటూ పరిచయం చేసుకుంది. ఎవరూ లేరని చెప్పడంతో జాలి చూపించిన సునీల్ కుమార్.. ఆమెకు అండగా నిలవాలనుకున్నాడు.

సునాసిని మాటలు నమ్మిన సునీల్.. ఆమెకు జీవితాన్ని ప్రసాదించాలని నిశ్చయించుకున్నాడు. గతేడాది డిశంబర్ లో పెళ్లి కూడా చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. కానీ ఈ నెల 7న సునీల్ తో గొడవపడిన సుహాసిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. భార్య కోసం ఆరా తీశారాయన. అప్పుడే ఆ కిలాడీ లేడీ అసలు రంగు బయటపడింది. సుహాసిని ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుందని తేలింది. ఆమె నిత్య పెళ్లి కూతురని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఏం చేయాలో తెలియక అలిపిరి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. భార్యగా నటిస్తూ తన దగ్గర సునీల్ నుంచి ఆరు లక్షలు కాజేసిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

నెల్లూరు జిల్లా కోనేటి రాజుపాలెంకు చెందిన వెంకటేశ్వర్లును పెళ్లి చేసుకున్న సుహాసినికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తేలింది. ఏడాదిన్నర క్రితం మరో యువకుడిని రెండో పెళ్లి చేసుకొని 7 నెలల క్రితం.. సునీల్ చేత మూడు ముళ్ళు వేయించుకుని మూడో పెళ్లి చేసుకుంది.. ఆ మాయ లేడీ. బాధితుడి ఫిర్యాదుతో.. నిందితురాలి కోసం గాలింపు చేపట్టగా.. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు.

Also Read: ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని ఆపై మోసం..! శానిటైజర్ తాగిన యువతి

డాక్టర్ల నిర్లక్ష్యం..! ఆ ఇంజెక్షన్‌తో నీలం రంగులోకి చిన్నారి శరీరం.. ఆపై మృతి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్