కేరళలో దారుణ ఘటన.. చిరుత పులిని చంపి తినేశారు.. ఇలా ఎందుకు చేశారని అడిగితే ఏం చెబుతున్నారంటే..

Poachers Kill And Eat Leopard: కేరళలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వేటగాళ్లు చిరుత పులిని చంపి ఏకంగా కూర వండుకొని తినేశారు.

  • uppula Raju
  • Publish Date - 9:52 pm, Sat, 23 January 21
కేరళలో దారుణ ఘటన.. చిరుత పులిని చంపి తినేశారు.. ఇలా ఎందుకు చేశారని అడిగితే ఏం చెబుతున్నారంటే..

Poachers Kill And Eat Leopard: కేరళలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది వేటగాళ్లు చిరుత పులిని చంపి ఏకంగా కూర వండుకొని తినేశారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇలా ఎందుకు చేశారని అడిగితే వారు చెప్పే సమాధానం వింటే షాక్ అవుతారు. ఇప్పటి వరకు అన్ని జంతువుల మాంసాలు తిన్నామని కానీ చిరుతపులి మాంసం ఎప్పుడు తినలేదని అందుకే ఇలా చేశామని చెబుతున్నారు. ఈ మాటలు విన్న పోలీసులు నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

కేరళలోని ఇడుక్కి అటవీ ప్రాంతంలో మంకులంకు చెందిన కొల్లికోలవిల్ వినోద్ పికె, బాసిల్ గార్డెన్ విపి కురియాకోస్ , చెంపెన్‌పురైదతిల్ సిఎస్ బిను, మలాయిల్ సాలి కుంజప్పన్, వడక్కుంచలిల్ విన్సెంట్ అనే ఐదుగురు వ్యక్తులు చిరుతపులిని వేటాడి చంపేశారు. అనంతరం కూర వండుకొని తిన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి నిందితుల నుంచి మిగిలిన పులికూర, చిరుత పులి చర్మం స్వాధీనం చేసుకున్నారు. కాగా కేరళలో చిరుతపులి మాంసం తినే సంఘటన ఇదే మొదటిదని పోలీసులు తెలిపారు.