తాగిన మైకంలో కొడుకు అఘాయిత్యం..ఉరితీసిన తల్లిదండ్రులు
తెలుగు రాష్ట్రాల్లో మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలకు అంతేలేకుండా పోతోంది. కఠిన చట్టాలు అమలు చేసినప్పటికీ కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. తాగిన మైకంలో వావివరుసలు మర్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతినిత్యం ఏదో ఒకచోట, ఎవరో ఒక మహిళ అన్యాయానికి బలికావాల్సి వస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా లేపాక్షిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సిరివరం గ్రామానికి చెందిన నారాయణ స్వామి తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి వేధింపులకు గురి చేస్తుండడంతో అతని భార్య 3 నెలల […]
తెలుగు రాష్ట్రాల్లో మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలకు అంతేలేకుండా పోతోంది. కఠిన చట్టాలు అమలు చేసినప్పటికీ కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. తాగిన మైకంలో వావివరుసలు మర్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతినిత్యం ఏదో ఒకచోట, ఎవరో ఒక మహిళ అన్యాయానికి బలికావాల్సి వస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా లేపాక్షిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సిరివరం గ్రామానికి చెందిన నారాయణ స్వామి తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి వేధింపులకు గురి చేస్తుండడంతో అతని భార్య 3 నెలల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా గత అర్ధరాత్రి ఫూటుగా తాగేసి వచ్చిన నారాయణ స్వామి తల్లిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు కొడుకు చిత్రహింసలు భరించలేక అదే చీరతో నారాయణ స్వామి గొంతుకు బిగించి హత్య చేశారు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రతి రోజు కొడుకు పెట్టే నరకం భరించలేకే ఈ పని చేసినట్లుగా వారు పోలీసుల ముందు తమ గొడువెల్లబోసుకున్నారు.