భారీగా పట్టుబడిన కోడికత్తులు

ఏపీలో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతిది, కోడి పందాలది అక్కడ విడదీయరాని బంధం. బరిలో దిగేందుకు పందెం కోళ్లు ఇప్పటికే యుద్దానికి సిద్ధం కాగా, కత్తులు కూడా తయారు చేస్తూ..కొందరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఉభయ గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలు, పేకాట స్థావరాలపై పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతికి పందాలు నిర్వహించడానికి రెడీ అవుతున్న పందెం రాయుళ్లకు పోలీసులు ఇప్పటి నుండి చెక్‌ పెడుతున్నారు. పండగ సందర్భంగా […]

భారీగా పట్టుబడిన కోడికత్తులు
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 17, 2019 | 9:00 PM

ఏపీలో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతిది, కోడి పందాలది అక్కడ విడదీయరాని బంధం. బరిలో దిగేందుకు పందెం కోళ్లు ఇప్పటికే యుద్దానికి సిద్ధం కాగా, కత్తులు కూడా తయారు చేస్తూ..కొందరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఉభయ గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలు, పేకాట స్థావరాలపై పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతికి పందాలు నిర్వహించడానికి రెడీ అవుతున్న పందెం రాయుళ్లకు పోలీసులు ఇప్పటి నుండి చెక్‌ పెడుతున్నారు. పండగ సందర్భంగా కోడిపందాలకు ఉపయోగించే కోడి కత్తులను తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద 3,982 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డీఎస్పీ. కె కుమార్, సీఐ మురళీకృష్ణ ఎస్ఐ వై సతీష్ వివరాలు తెలిపారు. తాళ్ళరేవు మండలం సీతాపురం కు చెందిన కామాడిసోమరాజు సంక్రాంతి పండగలో కోడి పందెలకు ఉపయోగించే కోడి కత్తులను తయారు చేస్తున్న ప్రాంతాన్ని తనిఖీ చేయడం జరిగిందన్నారు. సోమరాజు తయారు చేస్తున్న కత్తులను కృష్ణ ఉభయగోదావరి జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పండగ సమయంలో భారీ ఎత్తున కత్తులను తయారు చేసి అమ్మకాలు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క కత్తిని 300రూపాయాల చొప్పున అమ్మకాలు చేయడం జరుగుతుందన్నారు. 12 లక్షల విలువచేసే 3,982 కత్తులు,  రెండు మిషన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. సంక్రాంతి సమయంలో కోడి పందాలు పేకాట శిబిరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు.. జిల్లా ఎస్పీ అద్నాన్ పరిమితం అస్మీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా కోడి పందాలు పేకాట శిబిరాలు నిర్వహించినా సంబంధించిన పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలని డిఎస్పి సూచించారు.