Crime News: మధ్యప్రదేశ్‎లో దారుణం.. టవల్ ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త..

మధ్యప్రదేశ్‎లో దారుణం జరిగింది. ఓ 50 ఏళ్ల భర్త స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వలేదని భార్యను హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది...

Crime News: మధ్యప్రదేశ్‎లో దారుణం.. టవల్ ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త..
Wife
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 08, 2021 | 4:24 PM

మధ్యప్రదేశ్‎లో దారుణం జరిగింది. ఓ 50 ఏళ్ల భర్త స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వలేదని భార్యను హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నిందితుడు, అటవీ శాఖ దినసరి వేతన ఉద్యోగి రాజ్‌కుమార్ బహే (50) గా గుర్తించారు. రాజ్‌కుమార్ స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పా బాయి (45)ని అడిగాడు. కానీ ఆమె టవల్ ఇవ్వలేదు. బోళ్లు తోముతున్న కొంతసేపు ఆగమని చెప్పింది.

దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై పారతో పదే పదే కొట్టారని కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిందని చెప్పారు. 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను బెందిరంచాడని పేర్కొన్నారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

గతంలో మధ్యప్రదేశ్‎లో ఇలాంటి ఘటన జరిగింది. షాదోల్​ జిల్లా సెమారియతోల గ్రామంలో కమలేశ్​ కోల్​.. భార్య రామ్​బాయ్​ కోల్‎​ను చికెన్​వండమని అడిగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన నిందితుడు కమలేశ్.. అక్కడే ఉన్న కర్రతో భార్య తలపై బలంగా మోదాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ముగ్గురు పిల్లల తల్లి అయిన 28 ఏండ్ల షిరిన్ బాను భర్త హత్య చేశాడు. చికెన్‌ ఫ్రై వండమని భార్యకు భర్త చెప్పాడు. ఇంటికి వచ్చి చూడగా భార్య ఆ కూర వండలేదని, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో కోపంతో చెక్కతో భార్య తలపై కొట్టగా ఆమె చనిపోయింది.

Read Also.. Crime News: అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు.. పోలీసుల విచారణలో బయటపడిన అసలు నిజం..