Mother kills her Child: కనికరం లేని కసాయి తల్లి.. భర్త మీద కొపంతో 18 ఏళ్ల పిల్లాడిని కాలువలో పడేసిన కిరాతకురాలు!

తల్లిదండ్రుల గొడవలకు బాలుడు బలైన విషాద ఘటన విజయవాడ ఆటోనగర్‌ కార్మిల్‌నగర్‌లో చోటుచేసుకుంది.

Mother kills her Child: కనికరం లేని కసాయి తల్లి.. భర్త మీద కొపంతో 18 ఏళ్ల పిల్లాడిని కాలువలో పడేసిన కిరాతకురాలు!
Child
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 10, 2021 | 9:46 AM

Mother kills her Child: దంపతుల మధ్య తగాదాలకు పసిపిల్లలు బలవుతున్నారు. కని పెంచిన పిల్లలనే కాదుకుంటున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నామన్న సృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తల్లిదండ్రుల గొడవలకు బాలుడు బలైన విషాద ఘటన విజయవాడ ఆటోనగర్‌ కార్మిల్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతానికి చెందిన విల్లువోలు జయరాజు, మీనాక్షిలకు 2019లో వివాహమైంది. వారికి దానియేలు (18 నెలలు), సామియేలు (6 నెలలు) పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ ప్లాస్టిక్‌ కంపెనీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో బుధవారం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె చిన్న కుమారుడిని తీసుకెళ్లి ఆటోనగర్‌లోని కాలువలో పడేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు కాలువలో దూకి గాలించి బయటకు తీశారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే సరికి మృతి చెందడంతో ఇంటికి తీసుకెళ్లారు. ఈఘటనకు సంబంధించి పటమట పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also… Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 18 మంది ప్రయాణికులు మృతి