AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. మర్రిమిట్ట మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి, ఎంపీ

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను..

ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. మర్రిమిట్ట మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి, ఎంపీ
K Sammaiah
|

Updated on: Jan 31, 2021 | 5:05 AM

Share

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతుల కుటుంబ సభ్యులను మహబూబాబాద్ జిల్లా ప్రధాన వైద్యశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవితలు పరామర్శించారు.

ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తాగి ఉండడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెళ్లి కావలసిన ఇంటిలో విషాదఛాయలు అలుముకున్నాయన్నారు. చనిపోయిన వారిలో డ్రైవర్ రమేష్ కు ఆర్. ఓ. ఎఫ్. ఆర్ పట్టా ఉంది, కానీ కార్డు లేదని, అయినప్పటికీ తమ శాఖ తరపున రాము కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

మృతదేహాల అంత్యక్రియలకు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆరుగురికి రూ.60 వేలు, ఎంపీ కవిత ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ఆరుగురికి 30 వేల రూపాయలు వారి వ్యక్తిగతంగా అందజేశారు. వెంటనే అంబులెన్స్ లు ఏర్పాటు చేసి, మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, హాస్పిటల్ సూపరింటెందెంట్ భీమ్ సాగర్, గూడూరు జెడ్పీటీసీ సుచిత్ర, టి.ఆర్.ఎస్ నేతలు భరత్ కుమార్ రెడ్డి, పరకాల శ్రీనివాస రెడ్డి, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ