AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిటిషనర్ కు సుప్రీం కోర్టు షాక్.. రూ.5 ల‌క్ష‌లు జ‌రిమానా

ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని మించి, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని ఆగ్రహించిన బెంచ్ రూ. 5 లక్షల జరిమానా కట్టాలని పిటిషనర్ ను ఆదేశించింది. నెల రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని,..

పిటిషనర్ కు సుప్రీం కోర్టు షాక్.. రూ.5 ల‌క్ష‌లు జ‌రిమానా
Jyothi Gadda
|

Updated on: Jun 12, 2020 | 2:20 PM

Share

థమ్సప్, కోకాకోలా కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం.. వాటి అమ్మకాలపై నిషేధం విధించాలంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశాడంటూ రూ.5 లక్షల జరిమానా విధించింది. తాను సామాజిక కార్యకర్తనని పేర్కొన్న ఉమెద్​సిన్హా చావ్డా అనే వ్యక్తి థమ్సప్, కోకాకోలాల సేల్స్ బ్యాన్ చేయాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన బెంచ్..విచార‌ణ జ‌రిపింది.

అయితే,  తన పిటిషన్‌లో ప్రత్యేకించి రెండు ప్రముఖ బ్రాండ్స్‌నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంపై స్పష్టతనివ్వడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. ఆ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అని నిరూపించలేకపోయారంటూ పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా వ్యాజ్యం దాఖలు చేసినట్లు కోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని మించి, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని ఆగ్రహించిన బెంచ్ రూ. 5 లక్షల జరిమానా కట్టాలని పిటిషనర్ ను ఆదేశించింది. నెల రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్ కు పంపించాలని చావ్డాను సుప్రీం కోర్టు ఆదేశించింది.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు