Telangana News: రూ. 5 లక్షలకు అట్టా నిప్పంటించాడు… అన్ని కొత్త నోట్ల కట్టలే.. రీజన్ ఇది
అక్రమ సొమ్మంటే వ్యామోహం, అది దొరక్కుండా ఉండాలనే ఆరాటం... ఏసీబీ అధికారులు రానే వచ్చారు. ఇక చేసేది ఏముంది తప్పనిసరి పరిస్థితుల్లో చేతిలో ఉన్న...

అక్రమ సొమ్మంటే వ్యామోహం, అది దొరక్కుండా ఉండాలనే ఆరాటం… ఏసీబీ అధికారులు రానే వచ్చారు. ఇక చేసేది ఏముంది తప్పనిసరి పరిస్థితుల్లో చేతిలో ఉన్న అక్రమ సొమ్ము కాల్చేశాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. మాజీ మండల ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ రూ.5 లక్షల డబ్బును తగలబెట్టేశాడు. ఇవన్నీ కొత్త రూ. 500 నోట్లు. తాను చేసిన అక్రమాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ట్రై చేసినా కూడా ప్లాన్ బెడిసికొట్టింది. అవినీతి నిరోధకశాఖ అధికారులు పక్కా స్కెచ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్ ఓ పని నిమిత్తం ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షలు లంచం ఇవ్వాలని ఆర్డర్ వేశాడు. లేదంటే ఫైల్ ముందుకు కదలదని కుండబద్దలు కొట్టేశాడు. బేరాసారాలు ముగిశాక చివరికి రూ.5 లక్షలకు ఫైనల్ అగ్రిమెంట్ కుదిరింది. అయితే బాగా తెలివైన ఈ కిలాడీ తహసీల్దార్ ఈ 5 లక్షల లంచాన్ని తనకు ఇవ్వకుండా వెంకటయ్య గౌడ్‌కు ఇవ్వాల్సిందిగా సూచించాడు. ఆయన సూచన మేరకు బాధితుడు రూ.5 లక్షలను వెంకటయ్య గౌడ్‌కు ఇచ్చాడు. అతడు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఏసీబీ అధికారులను చూసి.. చూడంగానే షాక్ తిన్న వెంకటయ్య గౌడ్ రూ.5 లక్షలను తగలబెట్టేశాడు. వెంటనే అధికారులు మంటలను ఆర్పేసి సగం కాలిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనతో హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో తహసీల్దార్ సైదులు గౌడ్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు అధికారులు. జిల్లెల గూడ, కల్వ కుర్తి, వెల్దండ మండలం చెదురుపల్లిలోని వెంకటయ్య గౌడ్‌కు చెందిన ఇళ్లలోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
మరో ట్విస్ట్.. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లిన ఎస్ఈసీ