మేక మేత కొట్లాట.. ఏకంగా మనిషి ప్రాణాలను తీసింది..

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖండ్వా జిల్లాలోని హప్లా గ్రామంలో సోమవారం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

మేక మేత కొట్లాట.. ఏకంగా మనిషి ప్రాణాలను తీసింది..

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖండ్వా జిల్లాలోని హప్లా గ్రామంలో సోమవారం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మేక మేసిన మేతకు సంబంధించి చిన్న గొడవ చోటుచేసుకుందని.. అయితే అది కాస్త పెద్ద ఘర్షణకు దారితీసిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 19 మందిని అరెస్ట్ చేశామని.. త్వరలో మరికొందర్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు. నిందితులపై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 307,302,147,148,149 కింద కేసులు నమోదు చేసినట్లు ఖండ్వా జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాదు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu