Andhra Pradesh: మీరు చోరీలు చేయండి.. మేం అమ్మిపెడతాం.. భర్తలకు బాసటగా భార్యలు.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగిరిపోద్ది…
మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఒక అంతరాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హిందూపురంకు చెందిన ఆరుగురు సభ్యుల గ్యాంగ్‌ను..
మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఒక అంతరాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హిందూపురంకు చెందిన ఆరుగురు సభ్యుల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ ముఠాగా ఏర్పడిన ఆ ఆరుగురు నిందితులు దోపిడీలకు తెగపడ్డారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని ఇంట్లోకి చొరబడి విలువైన ఆభరణాలు, వస్తువులు దోచుకోవడం పనిగా పెట్టుకున్నారు. అంతేకాదు ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వారితో ప్రతిఘటిస్తే తీవ్రంగా గాయపరచడం.. అందినకాడికి ఎత్తుక పోవడం మొదలు పెట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్య నేరాలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ నేరాలు మన రాష్ట్రంలోనే కాకుండా మూడు రాష్ట్రాల్లో చేసినట్లుగా గుర్తిచారు.
వీరు తప్పుడు మార్గంలో పయనిచడాకి వారి ఇంట్లోని ఆడవారే అని.. వీరి ఇళ్లలోని ఆడవారు వీరు చేసే పనులు ప్రొత్సహించడం విశేషం. ఎత్తుకొచ్చిన బంగారన్ని మార్కెట్లో అమ్మివ్వడం చేస్తుంటారని పోలీసులు తెలిపారు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈ గ్యాంగ్‌ను మడకశిర పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 955 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కేజి ల వెండి ఆభరణాలు.. 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ సుమారు 50లక్షల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఎప్పుడూ రికవరీ చేయలేదని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. ఒక్క పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలోనే 27 కేసులున్నట్టుగా నిర్ధారిచారు ఎస్పీ ఫక్కీరప్ప.
ఇవి కూడా చదవండి: Statue of Equality: మన సమాజంలో శాస్త్రం.. శస్త్రం రెండు ఉండాలి.. రామనగరిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..
Dera Politics in Punjab: ఎన్నికల వేళ డేరా చీఫ్ రామ్ రహీం విడుదల.. పంజాబ్‌లో రాజకీయ ప్రకంపనలు..!