కొవిడ్‌తో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రాధా జోత్స్నా‌లత మృతి..! సంతాపం ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి..

|

May 10, 2021 | 7:17 AM

Dr.Radha Jotsnalatha Died : ప్రముఖ వైద్యరాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ నేత డాక్టర్ రాధా జోత్స్నా‌లత కొవిడ్‌తో మృతి చెందారు.

కొవిడ్‌తో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రాధా జోత్స్నా‌లత మృతి..! సంతాపం ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి..
Dr.radha Jotsnalatha
Follow us on

Dr.Radha Jotsnalatha Died : ప్రముఖ వైద్యరాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ నేత డాక్టర్ రాధా జోత్స్నా‌లత కొవిడ్‌తో మృతి చెందారు. చికిత్స పొందుతూ సోమవారం చెన్నై లోని ఓ ప్రేవేట్ హాస్పిటలో తుదిశ్వాస విడిచారు .16 రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన డాక్టర్ రాధా జోత్స్నా లత చెన్నైలోని ఓ ప్రేవేట్ హాస్పటల్ చేరారు. అక్కడే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆక్సిజన్ అందకపోవడంతో ఐసీయూకు తరలిస్తున్న సమయంలో మృతి చెందారు. డాక్టర్ రాధా జోత్స్నాలత మృతి విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సేవా దృక్పథంతో ఎంతో మంది నిరుపేదలకు వైద్య సేవలు అందించిన గొప్ప వైద్యరాలుగా ఆమె పేరు గడించారు. గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ రాధా జోత్స్నాలత ఉన్నత విద్యను అభ్యసించి కులాంతర వివాహం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆమె పార్ధీవ దేహాన్ని చెన్నై నుంచి నెల్లూరు కు సాయంత్రం తీసుకొని వచ్చి పెన్నానది వద్ద నున్న స్వర్గధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ఆమె భర్త నాగరాజు తెలిపారు.

డాక్టర్ రాధా జోత్స్నాలత 2014 లో టీడీపీ తరుపున శాసన సభ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత రెండేళ్లు టీడీపీ ప్రభుత్వంలో గూడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా వ్యవహరించారు. ఆ తరువాత గూడూరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్ గా విశిష్ట సేవలందించారు.

తరువాత జరిగిన అనూహ్య పరిణామాలతోడాక్టర్ రాధా జోత్స్నాలత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో రాష్ట్ర మహిళ నేతగా గుర్తింపు సాధించారు. డాక్టర్ రాధా జోత్స్నా లత మృతి విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, ప్రముఖులు జోత్స్నాలత మృతికి సంతాపం ప్రకటించారు.

కరోనా అలర్ట్..! ఛాతి నొప్పి కొవిడ్ లక్షణమా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..

Horoscope Today: ఈ రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాల విషయాల్లో ఒత్తిడి ఉంటుంది.. ఈరోజు రాశి ఫలాలు..