Kochi Teen: వ్యాయాయం చేస్తూ 10 అంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

|

Aug 06, 2021 | 9:07 AM

Kochi Teen: కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో తీవ్ర విషాదం నెలకొంది. వ్యాయామం చేస్తూ 18 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.

Kochi Teen: వ్యాయాయం చేస్తూ 10 అంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Kochi Teen Died
Follow us on

Kochi Teen: కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో తీవ్ర విషాదం నెలకొంది. వ్యాయామం చేస్తూ 18 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్నాకుళం సౌత్ సమీపంలో చిత్తూరు రోడ్డులోని ‘శాంతి తోటేకాట్ ఎస్టేట్’ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఐరిన్ జాయ్(18) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. అయితే, ఆగస్టు 5వ తేదీన యువతి తన సోదరుడితో కలిసి అపార్ట్‌మెంట్ 10 అంతస్తులో ఉన్న టెర్రస్‌లో వ్యాయామం చేస్తోంది. అయితే, ప్రమాదవశాత్తు యువతి బాల్కనీ నుంచి జారి పడింది. కార్ పార్కింగ్ పైకప్పుపై పడిన యువతి.. అక్కడి నుంచి నేలపై పడింది. 10 అంతస్తులపై నుంచి పడిపోవడంతో.. యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు యువతిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం యువతి మరణంలో ఎలాంటి అనమానాలు లేవని పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. గతంలో కూడా ఎర్నాకుళంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని ఆరవ అంతస్తులో గల ప్లాట్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని సేలంకు చెందిన కుమారి.. ఇంతియాజ్ అహ్మద్ అనే న్యాయవాది అపార్ట్‌మెంట్‌లో ఇంటి పనిమనిషిగా పనిచేసింది. అయితే, ఏమైందో ఏమో గానీ.. ఆరవ అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. పట్టు తప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుమారిని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే, కుమారిని.. ఇంతియాజ్ తన అపార్ట్‌మెంట్‌లో బంధించి హింసించాడని, అతని నుంచి తప్పించుకునే క్రమంలోనే ఈ దారుణం జరిగిందని కుమారి భర్త శ్రీనివాస్ ఆరోపించాడు. ఈ ఆరోపణలను ఇంతియాజ్ కొట్టిపారేశాడు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో కుమారి బాల్కనీ నుంచి కిందపడిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also read:

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టుకోలేక..

చాణక్య నీతి: మీరు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

Telangana: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్..