Danam Nagender: దానం నాగేందర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా..

|

Jul 07, 2021 | 7:46 PM

ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు భారీ షాక్ తగిలింది. దానంకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.

Danam Nagender: దానం నాగేందర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా..
Danam Nagender
Follow us on

ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు భారీ షాక్ తగిలింది. దానంకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. తీర్పులో ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బంజారాహిల్స్‌లో 2012లో కారుకు అడ్డు వచ్చిన ఓ పోలీసుపై దాడి చేసి బెదిరించారన్న అభియోగంపై దానం నాగేందర్‌తో పాటు చట్నీ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదైంది.

నాంపల్లి కోర్టు నుంచి ఇటీవల ప్రజా ప్రతినిధుల స్పెషల్ కోర్టు అభియోగపత్రం బదిలీ అయింది. విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల కోర్టు దానం నాగేందర్​పై ఐపీసీ 323 సెక్షన్ కింద అభియోగాలు రుజువైనట్లు ప్రకటించింది. దానం నాగేందర్​కు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించిన కోర్టు.. జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అప్పీలు చేసుకునేందుకు వీలుగా దానం నాగేందర్​పై శిక్షను నెల రోజుల పాటు నిలిపివేసింది.

ఇవి కూడా చదవండి: Revanth Reddy Oath: గాంధీభవన్‌లో సంబురాలు.. TPCC కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు..

Viral Video: పప్పీని తల్లి కోడి కుమ్మేసింది.. రక్కేసింది.. పొడిచేసింది.. ఇంతలా ఎందుకు చేసిందో తెలుసా.. అయితే ఇక్కడ చూడండి..

Pakistan: కుక్క తోక, పాకిస్తాన్ బుద్ధి ఒక్కటే! సరిహద్దులో మళ్లీ అదే పని చేస్తోంది..

CM Jagan Letter to PM Modi: మరోసారి ప్రధానికి ఏపీ సీఎం లేఖ.. ఈ సారి కూడా అదే అంశం.. కానీ 14 పేజీలు..