కోజికోడ్‌లో పట్టుబడ్డ బంగారం, విదేశీ సిగరెట్లు

కేరళలో నిత్యం బంగారం పట్టుబడుతోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వారిలో పలువురు అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తున్నారు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న..

కోజికోడ్‌లో పట్టుబడ్డ బంగారం, విదేశీ సిగరెట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 19, 2020 | 10:34 PM

కేరళలో నిత్యం బంగారం పట్టుబడుతోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వారిలో పలువురు అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తున్నారు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ అక్రమార్కుల దందా వెలుగుచూస్తోంది. తాజాగా దుబాయి నుంచి కోజికోడ్‌ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించారు. అయితే బంగారాన్ని పొడి రూపంలో ఓ కవర్‌లో వెంట తీసుకువచ్చాడు. దీని విలువ దాదాపు రూ.11 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు..ఇతర పదార్ధాలతో పాటుగా.. విదేశీ సిగరెట్లను కూడా వెంట గుర్తించారు. దాదాపు 5వేలకు పైగా సిగరెట్లు ఉన్నయాని.. వీటి విలువ రూ.20 వేలకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపడుతున్నారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం