AP CRIME NEWS : చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర ఆవు దొంగల ముఠా అరెస్ట్.. 44 ఆవులు, 2 వ్యాన్లు స్వాధీనం..

| Edited By: uppula Raju

Jul 12, 2021 | 8:40 AM

AP CRIME NEWS : చిత్తూరు జిల్లాలో పోలీసులు అంతర్రాష్ట్ర ఆవు దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో

AP CRIME NEWS : చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర ఆవు దొంగల ముఠా అరెస్ట్.. 44 ఆవులు, 2 వ్యాన్లు స్వాధీనం..
Inter State Cow Gang
Follow us on

AP CRIME NEWS : చిత్తూరు జిల్లాలో పోలీసులు అంతర్రాష్ట్ర ఆవు దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో ఆవుల అపహరణ పై పోలీసులు నిఘా పెంచారు. కాగా తవణంపల్లి వద్ద కర్ణాటక, హర్యానాకు చెందిన 5 మంది ముఠా సభ్యులు ఆవులను దొంగలించి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు.

నిందితులను విచారించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన నిజాలు తెలిసాయి. గత కొన్ని రోజులుగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆవులను దొంగతనం చేసినట్లు ఈ ముఠా సభ్యులు అంగీకరించారు. వీరి దగ్గరి నుంచి 25 లక్షల రూపాయల విలువైన 44 ఆవులు, 2 వ్యాన్లను స్వాదీనం చేసుకున్నారు. ఇందులో కర్ణాటకలోని కోలార్ కు చెందిన సుల్తాన్ షరీఫ్, అమీర్ ఖాన్, సయ్యద్ సుహేల్, నిజాముద్దీన్, హర్యానాకు చెందిన రాజుద్దీన్ లు ఉన్నారు. ఇంకా ఈ ముఠాలో చాలా మంది సభ్యులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మిగతావారికోసం కూడా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే..చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎదులను దొంగిలించారు కొందరు దుండగులు. గాంధీనగర్‌లో 5 ఆవులు, 2 ఎద్దులను దొంగల ముఠా అపహరించుకెళ్లింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ దోపిడీలకు పాల్పడుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ తమిళనాడులోని వేలూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

L Ramana: ఇవాళ తెలంగాణ భవన్‌కి ఎల్‌. రమణ, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా టీఆర్ఎస్ సభ్యత్వం

Puri Rath Yatra 2021: అంతా సిద్ధం.. కాసేపట్లో మొదలు కానున్న పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర

భూమి మీద బతికుండాలని రాసి పెట్టి ఉంటే…గోదాట్లో దూకిన చావు రాదంటారు !.. ఇప్పుడు అదే జరిగింది

Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.