బీటెక్ చదువుకోమని పంపిస్తే తప్పుదారి పట్టడు.. పాడు పనులు చేస్తూ అడ్డంగా బుక్‌ అయ్యాడు..

|

Oct 08, 2021 | 12:55 AM

Crime News: చదువుకోమని కాలేజీకి పంపిస్తే తప్పుదారి పట్టాడు. పాడు పనులు చేస్తూ పోలీసులకు చిక్కాడు. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌

బీటెక్ చదువుకోమని పంపిస్తే తప్పుదారి పట్టడు.. పాడు పనులు చేస్తూ అడ్డంగా బుక్‌ అయ్యాడు..
Iit Student
Follow us on

Crime News: చదువుకోమని కాలేజీకి పంపిస్తే తప్పుదారి పట్టాడు. పాడు పనులు చేస్తూ పోలీసులకు చిక్కాడు. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ జైలుపాలయ్యాడు. పుణెకు చెందిన మహవీర్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. దిల్లీలోని ఓ ప్రముఖ పాఠాశాలలోని బాలికలు, ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకొని యాప్స్‌పై తనకున్న పరిజ్ఞానంతో ఫొటోలను మార్ఫింగ్‌ చేయడం మొదలెట్టాడు.

తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వాయిస్‌ ఛేంజింగ్‌ యాప్‌ ఉపయోగించి మాట్లాడేవాడు. ఫేక్‌ కాలర్‌ ఐడీ యాప్స్‌ పాటు వాట్సాప్‌లోని వర్చ్యూవల్‌ నంబర్స్‌ ఎక్కువగా ఉపయోగించేవాడు. అమ్మాయిలు తనకు క్లోజ్‌ అయ్యారని తెలిశాక ఫొటోలను అడిగి వాటిని మార్ఫింగ్‌ చేసి వారి పేర్లతో ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసి అందులో అప్‌లోడ్‌ చేసేవాడు. అలా చాలా ఫొటోలు సోషల్ మీడియా వేదికల్లో కనిపించడంతో ఆ స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేక్‌మెయిల్‌ ఐడీకి వాడిన ఐపీ లాగిన్‌ వివరాలను తెలుసుకొని దర్యాప్తు చేయగా అవి బిహార్‌లోని పాట్నాకు చెందిన మహవీర్‌వని తేలింది. వెంటనే అతడిని అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న ఫొటోలు, ల్యాప్‌టాప్స్‌ని సీజ్‌ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులను విచారించి నిందితుడి పై పోక్సో సంబంధింత చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Kavya Thapar: క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో కవ్విస్తున్న కావ్య.. ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..