AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: నెల రోజుల పసికందుతో సహా భార్యను చంపిన భర్త.. పుట్టింటి నుంచి తీసుకొచ్చి మరీ..!

Hyderabad Crime: భార్యతో పాటు నెల రోజుల చిన్నారిని సైతం చిదిమేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది.

Crime: నెల రోజుల పసికందుతో సహా భార్యను చంపిన భర్త.. పుట్టింటి నుంచి తీసుకొచ్చి మరీ..!
Crime News
Balaraju Goud
|

Updated on: Mar 15, 2023 | 3:54 PM

Share

సమాజం మానవత్వం మంటగలుస్తోంది. క్షణికావేశంలో రక్త సంబంధాలను సైతం మరిచిపోతున్నారు. ప్రాణం కన్న మిన్నగా చూసుకోవల్సిన వారి ప్రాణాలనే తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తాళి కట్టిన భర్తనే కాలయముడయ్యాడు. భార్యతో పాటు నెల రోజుల చిన్నారిని సైతం చిదిమేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. భార్య లావణ్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం నెల రోజుల కుమారుడిని నీటి సంపులో వేసి హతమార్చాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌‌తో.. బండరావిరాలకు చెందిన లావణ్య నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల పాప ఉండగా.. గత నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. నెల రోజుల బాలింత అయిన లావణ్యను పుట్టింటి నుంచి బుధవారం రోజు తీసుకుని వచ్చాడు ధన్‌రాజ్. అదే రోజు భార్యను గొడలితో నరికి.. నెల రోజుల బాబును నీటి సంపులో వేసి కర్కశత్వాన్ని చాటుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందుతుడు ధన్‌రాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..