AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

తాళికట్టిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అతికిరాతకంగా భార్యను గొంతుకోసి హతమార్చాడు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే కుటుంబ కలహాల కారణంగా భార్యను అంతమొందించాడు. ఈ విషాద ఘటన..

భార్య గొంతు కోసి హతమార్చిన భర్త
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2020 | 11:54 AM

Share

తాళికట్టిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అతికిరాతకంగా భార్యను గొంతుకోసి హతమార్చాడు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే కుటుంబ కలహాల కారణంగా భార్యను అంతమొందించాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు…

కాసింపూర్ గ్రామానికి చెందిన శంకర్, పుణ్యవతి దంపతులు గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాల కారణంగా దూరంగా ఉంటున్నారు. గత ఎనిమిది నెలలుగా భార్య పుణ్యవతి పుట్టింట్లోనే ఉంటోంది. అయితే, పెద్దలు రాజీ కుదర్చడంతో ఐదు రోజులక్రితమే ఆమె తన భర్త వద్దకు వచ్చింది. అయితే, పొలం పనులకు వెళ్లి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వస్తుండగా, భార్యాభర్తల మధ్య గొడవ మొదలైందని, మాట మాట పెరగటంతో కోపోద్రిక్తుడై శంకర్ చేతిలో ఉన్న కత్తితో భార్య గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ సి ఐ సైదేశ్వర్, చిరాగ్పల్లి ఎస్ఐ గణేష్ సందర్శించి మృతదేహాన్ని జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడ్డ మృతురాలి భర్త శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow Us
ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం!
ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం!
కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు!
కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు!
మాతృత్వపు అనుభూతి అద్భుతం..నెటిజన్లతో ముచ్చటించిన సమంత!
మాతృత్వపు అనుభూతి అద్భుతం..నెటిజన్లతో ముచ్చటించిన సమంత!
జీతం పెరిగినా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగటం లేదా..?
జీతం పెరిగినా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగటం లేదా..?
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..