AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hi-tech Thief: అట్టాంటి, ఇట్టాంటి దొంగ కాదు, ఫ్లైట్‌లో వస్తాడు, ఆవులను దొంగతనం చేస్తాడు.. మళ్లీ…

పశువులను దొంగిలించి కబేళాలకు విక్రయిస్తున్న హర్యానాకు చెందిన 43 ఏళ్ల వ్యక్తిని తమిళనాడులోని వెల్లూరు జిల్లా పెర్నాంపేట్‌లో పోలీసులు సోమవారం...

Hi-tech Thief: అట్టాంటి, ఇట్టాంటి దొంగ కాదు, ఫ్లైట్‌లో వస్తాడు, ఆవులను దొంగతనం చేస్తాడు.. మళ్లీ...
Illegal transportation of cows
Ram Naramaneni
|

Updated on: Jul 07, 2021 | 6:44 PM

Share

పశువులను దొంగిలించి కబేళాలకు విక్రయిస్తున్న హర్యానాకు చెందిన 43 ఏళ్ల వ్యక్తిని తమిళనాడులోని వెల్లూరు జిల్లా పెర్నాంపేట్‌లో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తిని హర్యానాలోని భివానీ జిల్లా జమాల్పూర్ గ్రామానికి చెందిన ఎ హకీముదీన్ గా గుర్తించారు. అతని వద్ద నుంచి ఒక ఆవును, నకిలీ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడిన మినీ ట్రక్కుతో పాటు, రూ .70 వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెల్లడించాడు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆవులను, గేదెలను దొంగతనం చేసి.. వాటిని వెల్లూర్ లో కబేళాలకు అమ్మి… తిరిగి ఎంచక్కా ఫ్లైట్ లో తన సొంత ఊరికి వెళ్లిపోతానని అతడు తెలిపాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నెలా ఇదే తంతు కొనసాగిస్తున్నట్లు  అతడు చెప్పడంతో.. పోలీసులు కంగుతిన్నారు.

ఎలా చిక్కాడంటే..?

పెర్నాంపేటలో పశువులను పెంచే రజాక్ (50) అనే వ్యక్తి తన ఆవులలో ఒకటి శనివారం తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం పెర్నాంపేట, వి కొట్టా రోడ్ జంక్షన్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా… ఆవును తీసుకెళ్తున్న ఒక మినీ ట్రక్కును పోలీసు బృందం గుర్తించింది. పోలీసులు ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఫేక్ రిజిస్ట్రేషన్ అని తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఈ ఆవుల దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన  పోలీసులు.. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.

Also Read:  మాటు వేసి కాటు వేస్తున్నాయి.. బుసలు కొడుతూ బెంబేలెత్తిస్తున్నాయి.. ప్రతి నిమిషం టెన్షన్, టెన్షన్

ప్రేమంటే ఇదేరా.. రోజూ అన్నం పెట్టే అవ్వకు జ్వరమొచ్చిందని.. !

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..