Liquor Fire: అగ్నికి ఆహుతైన రూ.కోటి మద్యం.. ట్రక్‌లో ఢిల్లీకి తీసుకెళ్తుండగా..

| Edited By: Ravi Kiran

Mar 28, 2022 | 7:03 AM

Liquor Truck Fire: హర్యానాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తారావాడీ- శంగఢ్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో కోటి రూపాయల విలువైన మద్యం దగ్ధమైంది.

Liquor Fire: అగ్నికి ఆహుతైన రూ.కోటి మద్యం.. ట్రక్‌లో ఢిల్లీకి తీసుకెళ్తుండగా..
Liquor Truck Fire
Follow us on

Liquor Truck Fire: హర్యానాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తారావాడీ- శంగఢ్ జాతీయ రహదారిపై రెండు ట్రక్కులు ఢీకొన్న ప్రమాదంలో కోటి రూపాయల విలువైన మద్యం దగ్ధమైంది. రెండు ట్రక్కులు కూడా మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. నలాగఢ్ నుంచి ఢిల్లీ వైపు ట్రక్కులో మద్యం (విస్కీ) తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. శామ్‌గఢ్ సమీపంలోకి ఓ ట్రక్ డ్రైవర్ మొదట డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ ట్రక్ ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుకనుంచి మద్యంతో వస్తున్న ట్రక్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే రెండు ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయితే అంతకుముందే రెండు ట్రక్కులు పూర్తిగా దగ్దమైనట్లు అధికారులు తెలిపారు. ఒక ట్రక్కు ఖాళీగా ఉందని, మరో ట్రక్కులో కోటి రూపాయల మద్యం బాటిళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారి ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు అధికారులు తెలిపారు.

ట్రాలీ డ్రైవర్ నిద్రపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read:

PM Modi: మన్‌ కీ బాత్‌‌లో మెట్ల బావి ముచ్చట.. ప్రధాని మోడీ నోట ఆ వివరాలు..

Aadhaar Card: ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసినా OTP రావడం లేదా? కారణమిదే.. అయితే, ఇలా చేయండి..