AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: టీచర్‌ వేధింపులతో నిప్పంటించుకున్న విద్యార్థిని… ఒడిశాలోని బాలాసోర్‌లో ఘటన

బాలికతో అసభ్య ప్రవర్తన.. మహిళకు వేధింపులు.. వృద్దురాలిపై అత్యాచారం.. రోజూ ఇలాంటివి ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం... వీటికి భిన్నంగా ఒడిశాలోని బాలసోర్‌లో జరిగిన ఘటన సభ్య సమాజం షాకయ్యేలా చేసింది. కాలేజీలో పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే విద్యార్థినిపై కన్నేశాడు. లైంగిక కోరిక...

Odisha: టీచర్‌ వేధింపులతో నిప్పంటించుకున్న విద్యార్థిని... ఒడిశాలోని బాలాసోర్‌లో ఘటన
Student Suicide Attempt In
K Sammaiah
|

Updated on: Jul 13, 2025 | 10:19 AM

Share

బాలికతో అసభ్య ప్రవర్తన.. మహిళకు వేధింపులు.. వృద్దురాలిపై అత్యాచారం.. రోజూ ఇలాంటివి ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం… వీటికి భిన్నంగా ఒడిశాలోని బాలసోర్‌లో జరిగిన ఘటన సభ్య సమాజం షాకయ్యేలా చేసింది. కాలేజీలో పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడు తన దగ్గర చదువుకునే విద్యార్థినిపై కన్నేశాడు. లైంగిక కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేశాడు. లేదంటే భవిష్యత్తు నాశనం చేస్తానని వార్నింగ్‌లకు దిగాడు. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్‌ చాంబర్‌ ముందే నిప్పంటించుకుంది. కాలేజీలో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

బాధితురాలు ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు చదువుతున్నది. హెచ్‌వోడి సమీర్ కుమార్ సాహు యువతిని లైంగికంగా వేధించాడు. కోరిక తీర్చకుంటే భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. టీచర్‌ వేధింపులను ఆ విద్యార్థిని భరించలేకపోయింది. జూలై 1న కంప్లైంట్‌ సెల్‌కు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ, ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాలేజీ ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లింది. మిగతా స్టూడెంట్స్‌తో కలిసి ప్రిన్సిపాల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. అయితే ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడంతో తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

హఠాత్పరిణామానికి తోటి విద్యార్థులు షాక్‌ అయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఒక స్టూడెంట్‌కు కూడా మంటలంటుకున్నాయి. ఇద్దరిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు వారిని తరలించారు. కాగా, ఈ సంఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కీచక టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రి సూర్యబన్షి సూరజ్ ప్రకటించారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు సమీర్ కుమార్ సాహును అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వీడియో  చూడండి:

మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!