విషాదం: మొబైల్ పేలి విద్యార్థిని మృతి.. అసలు కారణం ఇదే..!

కజకిస్థాన్‌లో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ పేలి.. ఓ విద్యార్థిని చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌కి ఛార్జింగ్ అవుతున్నప్పుడు మాట్లాడం, పాటలు వినడం వంటివి చేయకూడదని తెలుసు. కాని కొందరు ఆ పని డేంజర్ అని కూడా అలానే చేస్తుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మొబైల్ పేలిన ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అయినా కొందరు మాత్రం ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌ని యూస్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:36 pm, Tue, 1 October 19
విషాదం: మొబైల్ పేలి విద్యార్థిని మృతి.. అసలు కారణం ఇదే..!

కజకిస్థాన్‌లో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ పేలి.. ఓ విద్యార్థిని చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌కి ఛార్జింగ్ అవుతున్నప్పుడు మాట్లాడం, పాటలు వినడం వంటివి చేయకూడదని తెలుసు. కాని కొందరు ఆ పని డేంజర్ అని కూడా అలానే చేస్తుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మొబైల్ పేలిన ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అయినా కొందరు మాత్రం ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్‌ని యూస్ చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

బాట్సోబాన్‌లోని 14 ఏళ్ల అలువా అస్సెట్‌కిజి అబ్జాల్చెక్ అనే అమ్మాయి మొబైల్‌లో పాటలు వింటోంది. అయితే.. మొబైల్‌లో ఛార్జింగ్ తక్కువగా ఉండటంతో కొద్ది సేపు ఛార్జింగ్ పెట్టింది. కాని పాటలు వినడం మాత్రం ఆపలేదు. కాసేపటికి మొబైల్ పేలి తలకి గట్టి దెబ్బ తగిలింది. ఫలితంగా దీని ఎఫెక్ట్ మెదడు పై పడింది. ఈ ఘటన తర్వాత కొద్ది సేపటికే ఆమె చనిపోయింది. ఛార్జింగ్ పెట్టి ఉన్నప్పుడు పాటలు వినడం వల్లనే ఇలా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. అలువా మృతి ఆమె కుటుంబసభ్యుల్లోనూ, స్నేహితుల్లోనూ విషాదాన్ని నింపింది.

తమ స్నేహితురాలు చనిపోవడంతో.. నిద్రపోతున్నప్పుడు మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టి, దాన్ని పక్కనే పెట్టుకుని పడుకోవద్దని చెబుతూ ఆలువా స్నేహితురాలు దోలాషేవా.. ఈ విషాద వార్తను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. గంటల తరబడి మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టి ఉంచినా పేలుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవలే బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గతేడాది మలేసియా క్రాడిల్ ఫండ్ మినిస్ట్రీ CEO… నర్జిన్ హస్సాన్ మరణం కలకలం రేపింది. నర్జిన్ కూడా బెడ్‌రూంలో ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి నిద్రపోయారు. అది పేలడంతోనే ఆయన చనిపోయారు. మొబైల్‌కి 100 శాతం ఛార్జింగ్ పెట్టడం కూడా.. అది పేలడానికి ఒక కారణం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.