షాకింగ్‌ ఘటన.. ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు..!

యూపీలో షాకింగ్‌ ఘటన ఒకటి స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని ఇటా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. సింగ్‌ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత దేహాలు బయటపడ్డాయి. శనివారం నాడు ఈ సంఘటన బయటపడింది. మృత దేహాలన్నీ ఒకే గదిలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దివ్య అనే ఓ మహిళ మృతదేహం తన అత్తవారింట్లో ఉందని పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు. అయితే అక్కడ ఆమెతో పాటుగా మరో నాలుగు మృతదేహాలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:44 pm, Sun, 26 April 20
షాకింగ్‌ ఘటన.. ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు..!

యూపీలో షాకింగ్‌ ఘటన ఒకటి స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని ఇటా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. సింగ్‌ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృత దేహాలు బయటపడ్డాయి. శనివారం నాడు ఈ సంఘటన బయటపడింది. మృత దేహాలన్నీ ఒకే గదిలో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దివ్య అనే ఓ మహిళ మృతదేహం తన అత్తవారింట్లో ఉందని పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు. అయితే అక్కడ ఆమెతో పాటుగా మరో నాలుగు మృతదేహాలు కూడా ఉన్నాయి. అవి దివ్య సోదరి బుల్‌బుల్‌, కుమారుడు ఆరుష్, మరో బిడ్డ అని పోలీసులు గుర్తించారు. ఇక ఇంటి రెండో అంతస్తులో.. దివ్య మామ రాజేశ్వర్‌ పచౌరి (75 ఏళ్లు ) మృత దేహం ఉండటాన్నిగుర్తించారు. దివ్య మెడపై పలు గాయాలు ఉండగా.. ఇక ఇతర మృతదేహాల వద్ద పలు మాత్రలు, పురుగుల మందు సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? అన్న అనుమానాలపై ఆరా తీస్తున్నారు.

కాగా.. ఇప్పటికే కరోనాతో భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు.. ఇప్పుడు ఈ ఒకే కుటుంబ సభ్యుల మరణంతో వణికిపోతున్నారు.