ఎస్సీ బాలికల హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు
ఖమ్మం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా హాస్టల్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగదాటికి తట్టుకోలేక నాలుగో తరగతి చదువుతున్న స్పందన అనే బాలిక మృతి చెందింది. అయితే ప్రమాదానికి ముందు వర్షం పడటంతో కరెంటు పోయింది. చీకట్లో బయటికి రాలేక విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ లోపలే చిక్కుకుపోయారు. కొందరు యువకులు గమనించి.. చిన్నారులను రక్షించారు. హాస్టల్ వద్దకు చేరుకుని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది […]
ఖమ్మం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా హాస్టల్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగదాటికి తట్టుకోలేక నాలుగో తరగతి చదువుతున్న స్పందన అనే బాలిక మృతి చెందింది. అయితే ప్రమాదానికి ముందు వర్షం పడటంతో కరెంటు పోయింది. చీకట్లో బయటికి రాలేక విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ లోపలే చిక్కుకుపోయారు. కొందరు యువకులు గమనించి.. చిన్నారులను రక్షించారు. హాస్టల్ వద్దకు చేరుకుని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని అధికారులు చెబుతున్నారు. యువకులు రావడం ఏ మాత్రం ఆలస్యం అయి ఉన్నా.. హాస్టల్ లో ఉన్న విద్యార్థులంతా షార్ట్ సర్య్కూట్‌కు బలైపోయేవారని చెప్పారు. హాస్టల్ యాజమన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతజరిగినా హాస్టల్ యాజమాన్యం స్పందించలేదు. చిన్నపాటి వర్షానికే ఇలా జరిగేది.. భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.