మా నాన్న నుంచి కాపాడండి.. యూపీలో ఓ కూతురి మొర
యూపీలో ఓ యువతి తన తండ్రి నుంచి తనను, తన భర్తను కాపాడాలంటూ పోలీసులను వేడుకుంటోంది. మరో కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నాననే ఆగ్రహంతో తన తండ్రి తనపైన, తన భర్త పైన గూండాలను పంపి దాడి చేయించే ప్రమాదం ఉందని ఆమె ఇదివరకే పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలో బరైలీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా ఇటీవల కులాంతర వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని రాజేష్.. […]
యూపీలో ఓ యువతి తన తండ్రి నుంచి తనను, తన భర్తను కాపాడాలంటూ పోలీసులను వేడుకుంటోంది. మరో కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నాననే ఆగ్రహంతో తన తండ్రి తనపైన, తన భర్త పైన గూండాలను పంపి దాడి చేయించే ప్రమాదం ఉందని ఆమె ఇదివరకే పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలో బరైలీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా ఇటీవల కులాంతర వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని రాజేష్.. పలుమార్లు ఈ దంపతులను హెచ్చరించాడు.. ఆదివారం అలహాబాద్ హైకోర్టు ముందు సాక్షి మిశ్రా భర్త అబ్జితేష్ కుమార్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి పారిపోయారు. ఈ ఆకస్మిక ఘటనతో అభితేష్, సాక్షి మిశ్రా షాక్ తిన్నారు. తమకు రాజేష్ నుంచి ప్రాణహాని ఉందని సాక్షి మిశ్రా ఇటీవలే సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రితో బాటు తన సోదరుని నుంచి కూడా ముప్పు ఉందని ఆమె పేర్కొంది. ‘ నాన్నా ! మాకు మీ రాజకీయాలు వద్దు.. నేను ఇష్టపడే ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.. దయచేసి మాకే హానీ తలపెట్టకుండా మా మానాన మమ్మల్ని వదిలేయండి. అని సాక్షి మిశ్రా అభ్యర్థించింది. అయితే రాజేష్ మిశ్రా.. ఆమె ఆరోపణలను ఖండిస్తూ.. వారి వివాహానికి తానేమీ వ్యతిరేకం కాదని, అయితే.. తన కూతురు ఆమె కన్నా వయస్సులో 9 ఏళ్ళు పెద్ద అయిన అభితేష్ ను పెళ్లి చేసుకోవడాన్ని తాను సహించలేకపోతున్నానని అంటున్నాడు. పైగా అభితేష్ జీతం కూడా చాలా తక్కువని, అతడు తన కుమార్తెను పోషిస్తాడని తాను అనుకోవడంలేదని పేర్కొన్నాడు. కానీ.. సాక్షి మిశ్రా మాత్రం.. తన జీవితం అభితేష్ తోనే ముడిపడి ఉందని, తాము హ్యాపీగా ఉన్నామని చెబుతోంది. ఇదంతా చూస్తే అచ్ఛు సినిమా కథనే తలపిస్తోందని అంటున్నారు చాలామంది.