బిందెడు నీళ్ల కోసం ఘర్షణ.. మహిళ మృతి..!

బిందెడు నీళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఈ ఘటనలో చేటుచేసుకుంది. మంచి నీళ్లు కోసం వెళ్లిన మహిళ చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సోంపేట మండల కేంద్రంలోని పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కుళాయి వద్దకు తాతాపు పద్మ అనే మహిళ నీళ్ల కోసం వెళ్లింది. అక్కడే ఉన్న తెప్పల సుందరమ్మకు, […]

బిందెడు నీళ్ల కోసం ఘర్షణ.. మహిళ మృతి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 15, 2019 | 3:17 PM

బిందెడు నీళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఈ ఘటనలో చేటుచేసుకుంది. మంచి నీళ్లు కోసం వెళ్లిన మహిళ చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సోంపేట మండల కేంద్రంలోని పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కుళాయి వద్దకు తాతాపు పద్మ అనే మహిళ నీళ్ల కోసం వెళ్లింది. అక్కడే ఉన్న తెప్పల సుందరమ్మకు, పద్మకు నీళ్ల కోసం గొడవ జరిగింది. బిందెలతో ఇద్దరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో కుళాయి నాచుపై కాలు పడి పద్మ కింద జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు.. చుట్టుపక్కల వారిని విచారించారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.