గుజరాత్‌లో కుప్పకూలిన జెయింట్ వీల్.. ఇద్దరు మృతి.. 29 మందికి గాయాలు
గుజరాత్ అహ్మదాబాద్ లోని అడ్వెంచర్ పార్కులో ఘోర ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్న సమయంలో పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా పార్కుకు వెళ్లిన వ్యక్తులు అనూహ్యంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మణినగర్‌లోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించి చికిత్స […]
గుజరాత్ అహ్మదాబాద్ లోని అడ్వెంచర్ పార్కులో ఘోర ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్న సమయంలో పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా పార్కుకు వెళ్లిన వ్యక్తులు అనూహ్యంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మణినగర్‌లోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు నగర మేయర్ బిజాల్ పటేల్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా చెప్పారు. ప్రధాన షాఫ్ట్ పైపు విరిగి నేలమీద కుప్పకూలిందని, దీనిపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ దర్యాప్తు చేస్తోందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ దస్తూర్ వెల్లడించారు.